తమిళనాడు కూనూర్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై లోక్ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. మ. 12.08 గం.కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి..భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు అక్కడికి వెళ్లారని తెలిపారు. స్థానికులు వెళ్లేసరికి హెలికాప్టర్ మంటల్లో ఉందని…ప్రమాదంలో 13 మంది మరణించారని తెలిపారు.సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మృతిచెందడం బాధాకరం అన్నారు.
ప్రమాదంపై వాయుసేన దర్యాప్తు చేపట్టిందని తెలిపిన రాజ్‌నాథ్..దర్యాప్తు బృందానికి ఎయిర్ మార్షల్ మనవేంద్ర సింగ్ నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే బృందం నిన్ననే వెల్లింగ్టన్కు వెళ్లి.. దర్యాప్తు ప్రారంభించిందన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించారు. కూనూర్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.