రష్యా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ

198
rajnath

రష్యా పర్యటనలో భాగంగా ఆదేశ రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోగితో భేటీ అయ్యారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు.

గురువారం రష్యాకు చేరుకున్న రాజ్‌ నాథ్‌ మాస్కోలోని భారతీయ ఎంబసీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌మావేశంలో పాల్గొన‌నున్నారు.

గ‌త రెండు నెల‌ల్లో ర‌ష్యాకు రాజ్‌నాథ్ విజిట్ చేయ‌డం ఇది రెండ‌వ సారి. రెండు రోజుల్లో మాలాకా సంధిలో రెండు దేశాల మ‌ధ్య ఇంద్రా నౌకాద‌ళ విన్యాసాలు జ‌ర‌గ‌నున్నాయి.