సుశాంత్ కేసులో దర్యాప్తు ముమ్మరం!

305
riya

బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సుశాంత్ సూసైడ్ మిస్టరీ కేసును సీబీఐ, ఈడీ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.

తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఇంట్లో నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయమే ముంబై జుహు తారా రోడ్డులోని రియా చక్రవర్తి ఇంటికి వెళ్లిన నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెళ్లారు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరండాల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. సుశాంత్ సహా అతడి సన్నిహితుల ప్రైవేట్ వాట్సప్ గ్రూప్‌లోని మెసేజ్‌ల ఆధారంగా డ్రగ్ ట్రాఫికింగ్ పై కీలక వివరాలు తెలుసుకున్నారు.