రజినీ పెట్టిన మంట.. ఏపీలో రచ్చ రచ్చ !

39
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమరాన్ని రేపుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్.. ఎన్టీ రామారావుతో తనకున్న అనుబంధాన్ని, అనుభవాలను పంచుకుంటూనే, చంద్రబాబు నాయుడు ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో మంట పుట్టిస్తున్నాయి. చంద్రబాబు గోప్ప విజనరీ లీడర్ అని, హైదరబాద్ ను అభివృద్ది చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందని చెబుతూ, చంద్రబాబు గెలిచిన ఓడిన ప్రజల మదిలో ఉంటారని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఏపీ అగ్రపథంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రజినీ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. అయితే జగన్ పాలన గురించి గాని వైసీపీ పార్టీ గురించి గాని రజినీ ఏం మాట్లాడకపోయినప్పటికి వైసీపీ నేతలు రజినీకాంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండడం గమనార్హం.

Also Read: బీజేపీ మేనిఫెస్టో.. గట్టెక్కిస్తుందా ?

చంద్రబాబు గురించి పొగుడుతూ రజినీ తన విలువను తగ్గించుకున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ రజినీకాంత్ చదువుతున్నారని, ఇలా రకరకాలుగా వైసీపీ నేతలు రజినీకాంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ” లెజండరీ పర్సనాలిటీ అయిన రజినీకాంత్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. శీకరం లాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం ఆకాశం పై ఉమ్మి వేయడమే అవుతుందని చంద్రబాబు ట్విట్టర్ లో మండిపడ్డారు. జగన్ నోటి దూల నేతలను కంట్రోల్ లో పెట్టుకోవాలని, చేసిన విమర్శలకు గాను క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. మొత్తానికి రజినీ రాక ఏపీలో తీవ్ర మంట పుట్టిస్తు రాజకీయ వేడిని పెంచుతోంది.

Also Read: ఏపీకి కే‌సి‌ఆరే దిక్కు !

- Advertisement -