ఏపీకి కే‌సి‌ఆరే దిక్కు !

38
- Advertisement -

ప్రస్తుతం ఏపీలో ఎన్నో సమస్యలు ఆ రాష్ట్రాన్ని వేధిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత హైదరబాద్ తెలంగాణకు సొంతం కావడంతో ఏపీలో అభివృద్ది కొరత ఏర్పడిందనే విషయం ప్రతిఒక్కరు ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని కొరత ఇలా ఎన్నో సమస్యలు ఏపీని వెంటాడుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న ఈ సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ప్రత్యేక హోదాతో రాష్ట్రంలో అభివృద్ది మెరుగుపడుతుందని ఏ‌పి‌ ప్రజలంతా ఎంతగానో ఆశిస్తున్నారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని మోదీ సర్కార్ తేల్చి చెబుతోంది. కేంద్రంతో పొరాడి హోదా సాధించుకునే దీశగా ఏపీ ప్రభుత్వంగాని ప్రతిపక్ష పార్టీలు గాని ప్రయత్నించడం లేదు. ఇక ఆంధ్రుల జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా లభించిన ఇంతరవరకు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయింది లేదు. ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

ఇక రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధత అంతా ఇంతా కాదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అవుతున్న ఇంతవరకు రాజధాని ఏర్పరచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికి.. ప్రభుత్వం మారగానే రాజధాని కూడా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ఏపీ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలతో ఏపీ నిండా మునిగిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని గట్టెక్కించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించాలన్నా సరైన నాయకుని అవసరం ఎంతైన ఉంది.

Also Read: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రివ్యూ..

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని గట్టెక్కించడం ఒక్క కే‌సి‌ఆర్ తోనే సాధ్యమని ఆ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. అలాగే బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కే‌సి‌ఆర్.. ఏపీలో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా కే‌సి‌ఆర్ లో ఉందని రాజకీయ అతివాదులు చెబుతున్నారు. అలాగే కే‌సి‌ఆర్ విజన్ తో తెలంగాణ ఎంత అభివృద్ది దిశగా పయనిస్తోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అన్నీ రంగాల్లోనూ అగ్రపథంలో దూసుకుపోతుంది. అందువల్ల ఏపీ అభివృద్ది చెందాలన్నా, ఆ రాష్ట్ర సమస్యలు సమసిపోవాలన్నా ఒక్క కే‌సి‌ఆర్ తోనే సాధ్యం అనే వాదన రోజురోజుకు బలపడుతోంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఏపీలో కే‌సి‌ఆర్ ప్రభావం గట్టిగా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: బీజేపీ మేనిఫెస్టో.. గట్టెక్కిస్తుందా ?

- Advertisement -