సూపర్‌స్టార్‌ ‘ద‌ర్భార్’ ట్రైల‌ర్ తేదీ ఖరారు..

344
Rajini
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఇందులో అరుణాచలం అనే ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Darbar

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల తేదీని చిత్ర బృందం అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌ర్ 16 సాయంత్రం 6.30ని.ల‌కి ద‌ర్భార్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మురుగ‌దాస్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాయి. ఈ యాక్ష‌న్ ప్యాక్డ్ ట్రైల‌ర్ అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ల‌డం ఖాయం అని ద‌ర్శ‌కుడు అంటున్నారు.

The highly anticipated trailer of AR Murugadoss’ action entertainer, Darbar starring Rajinikanth and Suniel Shetty is all set to be out on December 16.

- Advertisement -