ఆయన సినిమాలు చూస్తూ పెరిగా!

10
- Advertisement -

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సక్సెస్ తర్వాత నయనతార ఒక్కసారిగా బిజీ అయ్యింది. నిజానికి, ఈ హిట్ కి ముందు నయనతారకి బోలెడన్ని ఆఫర్స్ వచ్చినా అందులో నయనతారకి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ, అందులో నయనతార అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. మళ్ళీ జవాన్ తో నయనతార రేంజ్ మారిపోయింది. 39 ప్లస్ లోనూ నయనతార అందంగా, ఆకర్షణగా కనిపించడం.. ఆమెకు బాలీవుడ్ లోనూ ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో నయనతారకి హిందీలో పలు నిర్మాణ సంస్థల నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నయనతార, అజిత్ సినిమా చేస్తోంది. అలాగే, అజిత్ రెండో సినిమాకి కూడా నయనతార సైన్ చేసిందని టాక్.

అయితే ఓ ఇంటర్వ్యూలో జవాన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘జవాన్‌’ సినిమా నా కెరీర్‌ పై అత్యంత ప్రభావం చూపింది. నిజానికి నేను షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నటనకు నేను అభిమానిని తెలిపింది. షారుఖ్ మహిళలందరినీ ఎంతో గౌరవిస్తారు. అభిమానిస్తారు. అలాంటి వ్యక్తిని అందరూ ఆరాధిస్తారు అంటూ తన మనసులోని మాటలు చెప్పుకొచ్చింది.

Also Read:పీకే రిపోర్ట్ : వైసీపీకి డేంజర్ బెల్స్!

- Advertisement -