దేశంలో మరో సీఎంకు కరోనా..!

27
rajasthan

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అల్లాడిపోతోంది. రోజుకు రికార్డు స్ధాయిలో లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ఇక కరోనాతో పలు రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ విధించగా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూకు పరిమితమయ్యాయి.

ఇక పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బుధవారం రోజున ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సతీమణి కరోనా బారిన పడ్డారు. అనంతరం ముఖ్యమంత్రి కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. తనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా వైద్యుల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ సీఎం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.