నారప్ప కూడా వాయిదా పడింది…!

54
venky

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

తొలుత ఈ చిత్రాన్ని మే 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా పలు సినిమాల విడుదల తేదీ వాయిదా పడుతుండగా తాజాగా నారప్ప కూడా అదేబాటలో చేరింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ అధికారకంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలిపారు.