ఐపిఎల్ 12 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై రాజస్ధాన్ రాయల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నిర్ణిత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 175పరుగులు సాధించింది. కోత్ కత్తా ఓపెనర్ బ్యాట్స్ మెన్ లిన్ 3బంతులు ఆడి సున్నా పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితిష్ రానా 26బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ దినేశ్ కార్తిక ఓంటరి పోరాటం చేశాడు.
50బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సునిల్ నరైన్, రస్సెల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ రాయల్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రాజస్ధాన్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అజింకా రహానే 21బంతుల్లో 34పరుగులు చేసి అవుట్ కాగా సంజయ్ సామ్సన్ 15బంతుల్లో 21పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.
ఆ తర్వాత గ్రీసులోకి వచ్చిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ విజృంభించాడు. రాజస్దాన్ జట్టుకు చివర్లో దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు. పరాగ్ 31బంతుల్లో 47పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరగా సువర్ట్ బిన్ని 11బంతుల్లో 11పరుగులు చేయగా, శ్రేయాస్ గోపాల్ 9బంతుల్లో 18పరుగులు చేశాడు. 175పరుగులు చేసిన కోలకత్తాకు ఈమ్యాచ్ లో ఓటమి తప్పలేదు.