చిరును చూసి అంతా నేర్చుకోవాలి: రాజమౌళి

85
rajamouli
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి..రానున్న రోజుల్లో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్‌ ఉండదు. ఏ సినిమా తీసినా ఇండియన్‌ సినిమా అవుతుంది. అందుకు ఉదాహరణ రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు అన్నారు. అలాంటి సినిమాల రూపకర్త మన పరిశ్రమలో ఉండడం గర్వ కారణం. భారతీయ సినిమా ఒక మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళ అని కొనియాడారు.

రాజమౌళి వేసిన దారి వల్ల ప్రతి సినిమా పాన్‌ ఇండియా మూవీ స్థాయికి వెళ్తుంది. కథలో బలం ఉంటే, స్టార్స్‌ ఏ ప్రాంతం వాళ్లైన పాన్‌ ఇండియా నటులు, దర్శకులే అవుతారు. గతంలో మణిరత్నం, ఆ తర్వాత శంకర్‌ తమిళ సినిమా గర్వపడే చిత్రాలు చేశారు. ఇప్పుడు వస్తున్న చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియా చిత్రాలే అన్నారు.

ఎంత సక్సెస్‌ ఉన్నా నేలపై ఎలా నిలబడాలో, వినమ్రంగా ఉండాలో చిరంజీవిగారిని చూసి నేర్చుకోవాలన్నారు రాజమౌళి. ఆచార్య విజువల్స్‌ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి… ‘మగధీర’ సమయంలో చిరంజీవిగారు కథ విన్నారు. చరణ్‌కు సంబంధించి ఆయనే నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారని అనుకున్నా. చరణ్‌ సినిమాల విషయంలో చిరంజీవి ఎలాంటి సలహాలు ఇవ్వరు అన్నారు.

- Advertisement -