రాహుల్‌ నామినేషన్‌..ఈసీ గ్రీన్ సిగ్నల్

158
Rahul Gandhi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నామినేషన్‌ వివాదానికి తెర పడింది. అన్నివివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాహుల్‌ నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. నామినేషన్‌లో వివరాలు తప్పుగా ఉన్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్ లాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. రాహుల్ పౌరసత్వం, విద్యార్హతలను తన అఫిడ్‌విట్‌లో తప్పుగా పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం ఓకే చెప్పింది ఈసీ.

ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కేసీ కౌషిక్ అమేధీలో మాట్లాడుతూ…రౌల్ విన్సీ ఎవరో,ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని….రాహుల్ గాంధీ 1995లో కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి M.Phil పూర్తి చేశారని చెప్పారు. రాహుల్ చదివిన సర్టిఫికెట్ కాపీని అటాచ్ చేశానని చెప్పిన కౌషిక్ రాహుల్‌కు భారతదేశం తప్ప ఏ దేశ పైరసత్వం లేదన్నారు. భారతీయ పాస్ పోర్టు ఉందని ఆయన ఓటర్ ఐడీ,ఇన్ కమ్ ట్యాక్స్ ఇలా అన్నీ భారత్ లోనే ఉన్నాయని తెలిపారు.

ఇది ఇలా ఉండగా రాహుల్ కేరళలోని వాయినడ్‌తోపాటు యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేథి రాహుల్ కుటుంబానికి కంచుకోట. గతంలో ఈ స్ధానం నుండి ఇందిరా గాంధీ,సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.