ఈనెల 25న “ఇద్దరి లోకం ఒకటే”

277
iddari lokam Okate

యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. ఈమూవీలో షాలినీ పాండే కథానాయికగా నటిస్తుంది. జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కాగా ఈమూవీని ఈనెల 25 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. కాగా రాజ్ తరుణ్‌ కు చాలా కాలం నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈమూవీపై రాజ్ తరుణ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.