దిశ హత్యపై కీలక విషయాలు వెల్లడించిన నిందితులు

757
Disha
- Advertisement -

షాద్ నగర్ లో దారుణ హత్యకు గురైన దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ కు న్యాయం చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. అటు పార్లమెంట్, రాజ్యసభల్లో కూడా దిశ ఘటనపై చర్చ జరిగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు 14రోజుల రిమాండ్ కోసం చెర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా దిశ ఘటనపై మరోసారి స్పందించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. దిశకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. నిందితులందరికి తర్వలోనే కఠిన శిక్ష పడేలా చూస్తామని హామి ఇచ్చారు.

ఎంతో అనుభవమున్న అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామని, వారు బలమైన సాక్ష్యాధారాలను తయారు చేస్తున్నారని అన్నారు.కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో దిశపై వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఫేస్ బుక్ లో దిశపై అనుచితంగా పోస్టులు పెట్టిన ఫకీరాబాద్‌ కు చెందిన యువకుడు చావన్‌ శ్రీరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా రిమాండ్ పై చెర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను విచారిస్తున్నారు అధికారులు. అయితే ఈవిచారణలోపలు కీలక అంశాలను వెల్లడించాడు ప్రధాన నిందితుడు అరిఫ్. అందరూ అనుకున్నట్లుగా ఆమె చనిపోయిన తర్వాత పెట్రోల్ పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కానీ ఆమె బతికి ఉండగానే సజీవ దహనం చేసినట్లు నిందితుడు అరీఫ్ పోలీసులకు చెప్పాడు.

- Advertisement -