రాష్ట్రంలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

286
Weather report
- Advertisement -

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాత్రి‌వేళ ఉక్కపోత, పగ‌టి‌పూట ఎండ తీవ్రత పెరి‌గింది. సోమ‌వారం వికా‌రా‌బాద్‌, మెదక్‌, సంగా‌రెడ్డి జిల్లాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో తేలి‌క‌పాటి నుంచి మోస్తరు వానలు కురి‌సి‌నట్టు టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది. కర్ణా‌టక తీరం నుంచి గోవా మీదుగా ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉత్తర–‌ద‌క్షిణ ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో మంగ‌ళ‌వారం ఒకటి రెండు చోట్ల తేలి‌క‌పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. రాష్ట్రంలో మంచి‌ర్యాల జిల్లా వేమ‌న‌పల్లి మండలం నీల్వా‌యిలో 40.4, జిన్నా‌రంలో 40.1 డిగ్రీల గరిష్ఠ, రంగా‌రెడ్డి జిల్లా చౌద‌రి‌గూడెం మండలం కాసు‌ల‌బా‌ద్‌లో 17.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది.

- Advertisement -