వయానాడ్‌కు రాహుల్ గాంధీ

48
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం వయానాడ్‌లో ఇవాళ పర్యటించనున్నారు. మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కొల్పోగా సుప్రీం తీర్పుతో తిరిగి ఎంపీగా పార్లమెంట్‌లోకి ప్రవేశించారు రాహుల్. ఇక తాజాగా తొలిసారిగా వయానాడ్‌లో పర్యటించనున్నారు రాహుల్.

రాహుల్ రాక సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేశామని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీటీ సిద్ధిఖీ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు రాహుల్. ప్రజలను కలిసేందుకు మొదటిసారి వస్తున్న రాహుల్ గాంధీ… వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

ఇక రాహుల్‌ ఎంపీ కావడంతో తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించారు. బంగ్లా కేటాయింపుపై అధికారిక ధృవీకరణ లభించిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Also Read:మంత్రి కేటీఆర్ ప్రసంగానికి అద్భుత స్పందన..

- Advertisement -