గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి నిరాశే

61
- Advertisement -

గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నిరాశే ఎదురైంది. ఇప్పటికే రెండేళ్లు జైలు శిక్షతో పాటు ఎంపీ పదవిని కొల్పోయారు రాహుల్. దీనిపై గుజరాత్ కోర్టులో సవాల్ చేయగా చుక్కెదురైంది.

మోదీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్య‌లు చేసిన కేసులో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ఇవాళ హైకోర్టు స‌మ‌ర్థించింది. సూర‌త్ ట్ర‌య‌ల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజ‌రాత్ హైకోర్టు నిరాక‌రించింది. దీంతో రాహుల్ గాంధీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త కోల్పోయారు. అయితే ఈ కేసు విష‌యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం.

Also Read:షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా..?

- Advertisement -