‘పుష్ప’ మూవీపై కొత్త చర్చ..!

54
Pushpa

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రేక్షకులకు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన ఒక రూమర్ వైరల్ గా మారింది. రెండు భాగాలుగా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దీంతో ఈ సినిమా నిడివి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అయితే తాను చెప్పదలచుకున్న విషయాన్ని తగ్గించి చెప్పడం వలన ఇంపాక్ట్ పోతుందని భావించిన సుకుమార్, రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఒక భాగాన్ని దసరాకి విడుదల చేసి, మరో భాగాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాడని అంటున్నారు.

కాగా, అడవి నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన సరసన ఆడిపాడే గ్రామీణ యువతిగా రష్మిక అలరించనుంది. ఆయన చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఆకట్టుకోనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, ఊర్వశీ రౌతేలా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.