పుష్ప…రష్మికా లుక్ రివీల్!

65
rashmika

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధానపాత్ర పోషిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా రష్మికా లుక్‌ని రివీల్ చేశారు. ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లిని పరిచయం చేశారు.పోస్టర్ లో రష్మికా రెడీ అవుతూ కనిపించగా తాంబూలంలో పట్టు చీరతో పాటు పువ్వులు కూడా ఉన్నాయి. శ్రీవల్లి పెళ్ళికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది.

ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా సినిమా తెరకెక్కుతోంది.