పోసానిపై కేసు నమోదు…

41
posani

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. పవన్ పై ఫైర్ అవుతూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయగా పోసానిపై జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ డ్ కేసు నమోదు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోసానిని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని, ఆయన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. పోసాని ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు పవన్ అభిమానుల నుండి తనకు హాని పొంచి ఉందని…తనకు రక్షణ కల్పించాలని పోలీసులను తలసాని కోరినట్లు సమాచారం.