ప్రక్షాళన యజ్ఞం జరిగింది..

230
modi
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శనివారం రాత్రి దిల్లీ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ నవంబర్‌ 8న మోదీ కీలక ప్రసంగం చేసిన మోడీ తాజాగా మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించడంతో దేశవ్యాప్తంగా ప్రముఖ్యత నెలకొంది. మొదట నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన…మోడీ నూతనోత్తేజంతో ప్రజలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ‘‘దేశ ప్రజల సహకారంతో ఆర్ధిక వ్యవస్త ప్రక్షాళన యజ్ఞం జరిగిందన్నారు. నోట్ల రద్దు వల్ల దేశానికి మేలే జరుగుతుందని… భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దీపావళి తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నాం. చెడును ఓడించడానికి పోరాటం కొనసాగుతోంది. అవినీతిరహిత సమాజ నిర్మాణం కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష.

Modi

అవినీతి అంతం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు భుజం భుజం కలిపి సాగిస్తున్న పోరాటం ఇది. నల్లధనంపై పోరాటంలో ప్రజలు ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. గడిచిన కొద్ది రోజులుగా డబ్బుల కోసం నిజాయతీపరులు కొంత ఇబ్బందులు పడిన విషయం నాకు తెలుసు. ప్రజల త్యాగం వారికి భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది’’ అని వివరించారు. . అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. గతంలో నిజాయితీ పరులు చాలా సమస్యలు ఎదుర్కోన్నారు. దేశంలోని అవలక్షణాలపై పోరాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిజాయతీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.

ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా సాగితేనే దేశ భవిష్యత్తు ఉజ్వలం అవుతుందనడంలో సందేహం లేదని తెలిపారు. దేశంలో అమలవుతోన్న ఆర్థిక విధానంలో ఎన్నో లోపాలున్నాయని,. నగదు ఎక్కువగా చెలమణిలో ఉండటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయాన్నారు. అవినీతి, నల్లధనమూ పెరిగిందని అయితే నగదు రహిత విధానంతో ఈ సమస్యలన్నీ రూపుమాసిపోతాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు.

ప్రజలు తమ సొంత డబ్బును తీసుకొనేందుకు క్యూలలో నిలుచున్నారన్న సంగతి తనకు తెలుసునన్నారు. తనకు అనేక మంది ఉత్తరాలు రాశారని, వాటిలో తాము అనుభవిస్తున్న కష్టాలను వివరించారని, అదే సమయంలో దృఢనిశ్చయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. బ్యాంకులను సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ముఖ్యంగా సాధ్యమైనంత త్వరగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకులను సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం కోసం 9 లక్షల రుణం తీసుకునేవారికి 4 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. అలాగే 12 లక్షల రూపాయల రుణం తీసుకునే వారికి 3 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. ఇళ్ల మరమ్మతుల కోసం 2 లక్షల రూపాయల రుణాలు ఇస్తారు. ఈ రుణాలపై 3 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. ప్రధాని ప్రకటనతో ఉద్యోగస్తులకు, మధ్య తరగతివారికి ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -