రజినీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్‌..

125
rajinikanth

కబాలి..రజినీకాంత్ నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందుకు భారీ హైప్‌నే క్రియేట్ చేసింది. టీజర్ తోనే సినిమాపై ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. మరోసారి బాషా సినిమాను తలపించేలా రజినీకాంత్ లుక్ ఉండడం…అలాగే కబాలి రా అంటూ వచ్చే డైలాగ్స్ సూపర్బ్‌గా ఉండడంతో దక్షిణాది రికార్డులు చదిరిపోవడం కాయమంటూ సినిమాపై ఫుల్స్ హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. దాదాపు పది పదిహేను భాషల్లో కబాలి రిలీజైంది. మలేసియా లోని భారతీయ వలస బ్రతుకుల మీద ఈసినిమా తీసారు.

అయితే రిజల్ట్ సంగతి ఎలా ఉన్న కలెక్షన్స్ విషయంలో మాత్రం రజినీకాంత్ మానియా ఎంటో అర్ధమైంది. దాదాపు 400 కోట్లు వసూలు చేసి..హైయ్యేస్ట్ గ్రాసర్‌ లో టాప్ 10లో నిలిచింది. పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ గా మారింది. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను సూపర్ స్టార్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. కబాలి లోని కొన్ని డిలీటెడ్ సీన్స్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా రజినీ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది.

Rajinikanth and Radhika Apte Scene | Kabali Deleted Scenes | Pa Ranjith | V Creations

Rajinikanth finds out Dhanshika's Love | Kabali Deleted Scenes | Dinesh | Pa Ranjith | V Creations

Kabali expresses his love for Kumuthavalli | Kabali Deleted Scenes | Dhanshika | Radhika Apte

Rajinikanth Gets a Gun from Don | Kabali Deleted Scenes | Radhika Apte | Pa Ranjith | V Creations

Rajinikanth Kabali Deleted Scenes | Radhika Apte | Pa Ranjith | V Creations