టాలీవుడ్ డేరింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటివల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పూరీకి సరైన హిట్ రావడంతో చాలా ఆనందంగా ఉన్నాడు పూరీ. రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా దాదాపు రూ.80కోట్లు వరకు వసూలు చేసింది.
ఈసినిమాను పూరీ తన సొంత బ్యానర్ పూరీ కనెక్స్ ద్వారా నిర్మించి చార్మి నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఈసినిమాకు కలెక్షన్లు భారీగా రావడంతో తాజాగా దర్శకుడు పూరీ, ప్రొడ్యూసర్ ఛార్మీ రెండు ఖరీదైన కార్లను కోనుగోలు చేశారు. ఈవిషయాన్ని ఛార్మీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పూరి రేంజ్ రోవర్ వోగ్ కారును కొనగా.. చార్మి బీఎం డబ్ల్యూ 7 సీరీస్ కారును కొనడం జరిగింది.
పూరీ జగన్నాథ్ తన తర్వాతి మూవీని విజయ్ దేవరకొండతో చేయనున్నాడు. ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈమూవీకి ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈసినిమాను కూడా పూరీ తన సొంత బ్యానర్ లోనే నిర్మించనున్నారు.