బిగ్ బాస్3..రాహుల్ కి ముద్దుపెట్టిన పునర్నవి

934
punarnavi bhupal kisses rahul
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 తెలుగు  విజయవంతంగా 8వారాలు పూర్తి చేసుకుంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, తిట్టుకోవడంతో గేమ్ హాట్ హాట్ గా సాగుతుంది. ఇక షో 9వ వారంలోకి ఎంటర్ కావడంతో ఈవారం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు బిగ్ బాస్. ఈవారం నామినేషన్ లో ఒకరి కోసం మరోకరి త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈఎలిమినేషన్ లో భాగంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

మొదట శ్రీముఖి వెళ్లి ఫోన్ లిప్ట్ చేయగా బాబా భాస్కర్ తన గడ్డం ను తీసివేస్తే శ్రీముఖి సేవ్ అవుతారని చెప్పారు. దీంతో వెంటనే బాబా భాస్కర్ వెళ్లి తన గడ్డాన్ని తీసేశారు. ఆ తర్వాత తిరిగి ఫోన్ చేసిన బిగ్ బాస్ శ్రీముఖి సేవ్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఫోన్ బూత్ లోకి పునర్నవి వెళ్లింది.

పునర్నవి సేవ్ కావాలి అంటే రాహుల్ 20గ్లాసుల కాకరకాయ జూస్ తాగాలని చెప్పాడు. దీంతో వెంటనే రాహుల్ ఒప్పేసుకున్నాడు. 20 గ్లాసుల జ్యూస్ ను తన సన్నిహితురాలైన పునర్నవి కోసం అలవోకగా తాగేశాడు. చివరి గ్లాస్ పూర్తి చేసి విజయగర్వంతో తన వద్దకు వచ్చిన రాహుల్ ను పునర్నవి గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య బంధం గట్టిగానే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

- Advertisement -