జీ సినీ అవార్డ్ విజేతల లిస్ట్

386
zee awards
- Advertisement -

ప్రముఖ టెలివిజన్ సంస్ధ జీ తెలుగు ప్రతి ఏడాది ప్రతిభ కనబర్చిన సినీ ప్రముఖులకు అవార్డులు ప్రధానోత్సవం చేస్తుంది. ఈసంవత్సరానికి అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సైరా నరసింహారెడ్డి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా చిరంజీవి, మజిలీ, ఓ బేబీ చిత్రాలను గాను ఉత్తమ నటిగా సమంత అవార్డులు దక్కించుకున్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు ట్విటర్‌ స్టార్‌ అవార్డు దక్కింది. ఇస్మార్ట్‌ శంకర్‌  చిత్రం ఏకంగా నాలుగు అవార్డులు దక్కించుకుంది.ఉత్తమ నిర్మాతగా ఛార్మి, బెస్ట్‌ సన్సేషన్‌ డైరక్టర్‌ గా పూరీ జగన్నాథ్, సన్సేషనల్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా రామ్,ఉత్తమ సంగీత దర్శకుడిగా మణిశర్మకు అవార్డులు లభించాయి  . కళాతపస్వీ కె విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి, కె విశ్వనాథ్‌, సమంత, భూమిక, శ్రద్దా శ్రీనాథ్‌, నిధి అగర్వాల్‌, రత్నవేలు పూజా హెగ్డే, రామ్‌, పూరి జగన్నాథ్‌, ఛార్మి, కార్తికేయ, నందినిరెడ్డి, ఖుష్బూ, జయప్రద, రెజీనా, నవీన్ పొలిశెట్టి, అనసూయ తదితరులు హాజరయ్యారు.

జీ సినీ అవార్డుల విజేతల వివరాలు..
ఉత్తమ నటుడు : చిరంజీవి(సైరా నరసింహారెడ్డి)
ఉత్తమ నటి : సమంత(మజిలీ, ఓ బేబీ)
బెస్ట్‌ ఫైన్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : శ్రద్ధా శ్రీనాథ్‌(జెర్సీ)
ఉత్తమ సహాయ నటుడు : అల్లరి నరేష్‌(మహర్షి)
ఉత్తమ హాస్యనటుడు : రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి(బ్రోచేవారెవరురా)
ఫెవరెట్‌ యాక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : నాని(జెర్సీ)
ఫెవరెట్‌ నటి : పూజా హెగ్డే (మహర్షి)
ఉత్తమ నిర్మాత : ఛార్మి(ఇస్మార్ట్‌ శంకర్‌)
సన్సేషనల్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : రామ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌)
బెస్ట్‌ సన్సేషన్‌ డైరక్టర్‌ : పూరి జగన్నాథ్‌(ఇస్మార్ట్‌ శంకర్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు : మణిశర్మ (ఇస్మార్ట్‌ శంకర్‌)
ఉత్తమ గాయకుడు : సిద్‌ శ్రీరామ్‌ (కడలల్లే.. డియర్‌ కామ్రేడ్‌ )
ఫేవరెట్‌ అల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : జస్టిన్‌ ప్రభాకరన్‌(డియర్‌ కామ్రేడ్‌)
ఉత్తమ విలన్‌ : తిరువే(జార్జిరెడ్డి)
ఉత్తమ స్ర్కీన్‌ప్లే : వివేక్‌ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)
ఉత్తమ నూతన నటుడు : శివాత్మిక రాజశేఖర్‌( దొరసాని)
ఉత్తమ నూతన నటుడు : ఆనంద్‌ దేవరకొండ(దొరసాని)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు(సైరా)
న్యూ సన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : తరుణ్‌ భాస్కర్‌ (మీకు మాత్రమే చెప్తా)
ఉత్తమ గాయని : చిన్నయి (ప్రియతమా.. మజిలీ)
ఫేవరెట్‌ డెబ్యూ డైరక్టర్‌ : స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే(ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఫేవరెట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ : నీల్‌ నితీశ్ ముఖేష్‌(సాహో)

- Advertisement -