మోదీకి బహిరంగ లేఖ రాసిన దర్శకుడు పూరీ

305
Director Puri Jagannath Modi

ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. వాతావరణంలో విపరీతమైన మార్పులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కటే కారణం కాదని, అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని లేఖలో పేర్కోన్నాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిత్యం వాడే కవర్లు లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.

కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. అయితే ఒక్క సారిగా ఈ బ్యాన్ వల్ల ప్రజలందరూ ప్లాస్టిక్‌ను వదిలి పేపర్ బ్యాగులు వాడడం చేస్తారని దీని వల్ల పేపర్‌‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో.. చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి వస్తుందన్నారు. మొదట దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మోదీని కోరారు.