దేశంలో నెంబర్‌ 1గా పంజాగుట్ట పీఎస్‌..

386
TS-Police
- Advertisement -

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని తెలిపారు నగర్ జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ . మంచుకొండ ఫౌండేషన్‌ సహకారంతో రూ. 10 లక్షలతో స్టేషన్‌ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను, భవన నిర్మాణ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసిన పార్కింగ్‌ ప్రాంతాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో మంచి మార్పు తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచుకొండ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ప్రకాశం, ట్రస్టీలు రవికుమార్‌, సురేందర్‌, ఏసీపీ పీవీ గణేష్‌, ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి, డీఐ నాగయ్య, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -