టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలకు మద్దతు:ఉర్దూ టీచర్స్‌

66
kavitha

రాష్ట్రంలో జరుగుతున్న 2 పట్టభద్రుల స్ధానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ రెండు స్ధానాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పక్కావ్యూహంతో దూసుకెళ్తోంది.

ఇప్పటికే పలు సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (యూటీఏ-టీఎస్‌) మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సురభీ వాణీదేవిల గెలుపునకు సహకరిస్తామని..ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు తమ మద్దతు లేఖను అందించారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తామని తెలిపాయి.

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి సురభీ వాణీదేవి, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.