మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. కానీ, పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగానే హిట్ అయింది. కలెక్షన్స్ పరంగా కూడా ‘పొన్నియన్ సెల్వన్ 2’ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ పాత్రలో అలియా భట్ ను కూడా అనుకున్నారట. నిజానికి ఈ సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నా.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న పాత్ర మాత్రం నందిని పాత్రనే.
ఈ నందిని పాత్రలో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ నిజంగానే జీవించింది. ఒక విధంగా ఈ నందిని పాత్ర సినిమా మొత్తంలోనే మెయిన్ విలన్. అందుకే, ఈ పాత్రని చేయడానికి చాలా మంది హీరోయిన్లు పోటీ పడ్డారు. వారిలో శ్రుతి హాసన్, త్రిష లతో పాటు అదితిరావు హైదరీ కూడా ఉన్నారు. అదితిరావు హైదరీ అయితే, ఈ పాత్ర తనకు ఇవ్వాలి అని మణిరత్నం అఫీస్ చుట్టూ తిరిగిందట. కానీ, మణిరత్నం మాత్రం ఐశ్వర్య రాయ్ వైపే మొగ్గు చూపారు. ఓ దశలో అలియా భట్ ను అప్రోచ్ కావాలి అనుకున్నా.. ఐశ్వర్య రాయ్ కూడా నేనే చేస్తా అని ఆసక్తి చూపించడంతో చివరకు ఆమెకే ఫిక్స్ అయ్యారు.
Also Read:హ్యాపీ బర్త్ డే..అనుష్క శర్మ
ఇక మిగిలిన మరో కీలక పాత్ర యువరాణి కుంధవై పాత్రలో శ్రద్దా కపూర్ ను అనుకున్నారు మణిరత్నం. అయితే, బడ్జెట్ సమస్య కారణంగా ఆమె కాదు అనుకున్నారు . అనంతరం శ్రుతి హాసన్ చేత చేయించాలి అనుకున్నారు. అయితే, లుక్ టెస్ట్ లో శ్రుతి హాసన్ సెట్ అవ్వలేదు. దాంతో శ్రుతి హాసన్ ను పక్కన పెట్టి.. త్రిష కి లుక్ టెస్ట్ చేశారు. త్రిష యువరాణి కుంధవైగా ఆకట్టుకుంది. దాంతో ఆ పాత్రకి ఆమెనే తీసుకున్నారు. ఇంతకీ, ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఏ రేంజ్ లాభలను అందుకుంటుందో చూడాలి.
Also Read:హ్యాపీ బర్త్ డే… అజిత్