హ్యాపీ బర్త్ డే… అజిత్

52
- Advertisement -

తలా అజిత్. సింప్లిసిటీకి కేరాఫ్‌. ప్రేమ పుస్తకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అజిత్ దక్షిణాది భాషల్లో నటించి మెప్పించారు. ఐదు పదుల వయస్సు దాటిన ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీనిస్తూ తమిళనాట తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇవాళ అజిత్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

1971 మే 1న సుబ్రమణ్యం-మోహిని దంపతులకు సికింద్రాబాద్‌లో జన్మించారు. అజిత్‌కు ఇద్దరు బ్రదర్స్ అనుప్,అనిల్. పదవ తరగతి వరకు చదువుకున్న అజిత్ బహుభాషా కోవిదుడు. తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం, ఇంగ్లీష్‌లో అనర్గలంగా మాట్లాడగలడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్నారు.

Also Read:May Day:కార్మిక దినోత్సవం

ఇక అజిత్ గురించి చాలామందికి తెలియని విషయం.. దేశంలోనే అత్యుత్తమ ఫార్ముల రేస్ డ్రైవర్లలో ఒకరు. 2004లో బ్రిటిష్ ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొని దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. రేసింగులో పాల్గొనేకంటే ముందు బైక్ మెకానిక్‌గా పనిచేశారు అజిత్. నాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు. ఒకసారి ప్రమాదం జరగడంతో, తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయి. అటునుంచి 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించాడు.

Also Read:దీనిపై కూడా రాజకీయమా.. తూ!

తమిళంలో 60కి పైగా సినిమాలు చేశాడు. తమిళంలో శ్రీదేవితో కలిసి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాకి పనిచేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. సాదాసీదా జీవితం గడపడమే అజిత్‌కు ఇష్టం. పాల ప్యాకెట్ కోసం కూడా లైన్ లో నిల్చుంటారు. అజిత్ కు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు బహుమతిగా ఇచ్చిన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’అజిత్‌కు నచ్చిన పుస్తకం. పెద్ద హీరో అయిన కూడా సాదా సీదా జీవితాన్ని గడిపే అజిత్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

Also Read:వైసీపీనే టార్గెట్..బాలయ్యతో బోయపాటి!

- Advertisement -