ఆ యాంకర్ సంపాదన కోట్లు

30
- Advertisement -

బుల్లితెర మీద ఎప్పటి నుంచో యాంకర్ సుమ హవానే కొనసాగుతుంది. చాలాకాలంగా యాంకర్ సుమ స్టార్ యాంకర్ గా వెలిగిపోతుంది. నెలకు డజనుకు పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ యాంకర్ గా చేస్తుంది. సుమ తర్వాతే ఎవరైనా. అలాగే, ‘సుమ అడ్డా’ పేరుతో ఒక షో కూడా చేస్తోంది. మొత్తానికి దశాబ్దాలు దాటుతున్నా సుమ యాంకర్ గా దూసుకుపోతూనే ఉంది. రష్మీ గౌతమ్, శ్రీముఖి, అనసూయ లాంటి గ్లామరస్ యాంకర్స్ కూడా సుమను దాటుకుని వెళ్లలేకపోయారు.

మరి సుమ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా ?, సంపాదనలో ఆమె ముందు హీరోయిన్స్ కూడా సరిపోరు అని టాక్ నడుస్తోంది. సుమకి ఉన్న డిమాండ్ రీత్యా ఆమె భారీగా సంపాదిస్తుందట. ఒక అంచనా ప్రకారం యాంకర్ సుమ సంపాదన రోజుకు రూ. 3 లక్షల ఉంటుందట. ఒక్కో కాల్షీట్ కి 3 లక్షలు తీసుకుంటుందట. ఒకే రోజు రెండు షిఫ్టులు చేస్తే డబుల్ రెమ్యూనరేషన్. వీటికి తోడు ప్రమోషన్స్, సోషల్ మీడియా యాడ్స్, ఈవెంట్స్ ద్వారా సుమకు అదనపు సొమ్ము వస్తోంది.

Also Read: కళ్యాణమస్తు..ట్రైలర్

పైగా ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. సుమకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. మొత్తంగా సుమ ఏడాది సంపాదన కోట్ల రూపాయలు అని పరిశ్రమ వర్గాల వాదన. సుమ సంపాదన హీరోయిన్స్ ని మించిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ మాత్రమే ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఏది ఏమైనా ఒక యాంకర్ సంపాదన.. స్టార్ హీరోయిన్ల సంపాదన రేంజ్ లో ఉండటం విశేషం.

Also Read: హ్యాపీ బర్త్ డే…సుమన్ శెట్టి

- Advertisement -