నోరు మూసుకునే కన్నా..చావడం మిన్నః నిర్మాత పీవీపీ

198
pvp
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పీవీపీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆతప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు..నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న అని ట్వీట్ చేశారు నిర్మాత పీవీపీ. ఇక ఈ ట్వీట్ ఎవరిని ఉద్యేశించి చేశాడని ఆలోచిస్తున్నారు నెటిజన్లు. ఇదిలాఉండగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న పీవీపీపై కేసు నమోదైంది. విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి ఫిర్యాదుపై ఈకేసు నమోదు చేశారు పోలీసులు.

నిర్మాత పీవీపీ తన ఇంటి మీదకి కొంత మంది రౌడీలను పంపించి బెదిరిస్తున్నాడని ఆ ఫీర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సీఆర్పీసీ సెక్షన్ 41కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. నోటిసులపై స్పందించిన పీవీపీ వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిన్న కొద్ది సేపు విచారించిన అనంతరం తిరగి గురువారం రావాలని ఆదేశించారు. దీంతో నేడు పీవీపీ ఈ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా పీవీపీపై గతంలో కూడా కేసులు ఉన్న సంగతి తెలిసిందే. నిర్మాత బండ్ల గణేశ్, పీవీపీలు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.

- Advertisement -