పోలీసులపైకి కుక్కలను వదిలిన నిర్మాత పీవీపీ

84
pvp

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ పై మరో కేసు నమోదు అయింది. ఓ కేసు విషయంలో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల పైకి తన కుక్కులను వదిలారు పీవీపీ. దీంతో కుక్కలు ఒక్కసారిగా మీదికి రావడంతో అక్కడి నుంచి భయంతో వెనుదిరిగారు పోలీసులు. ఈ విషయంపై పోలీసులు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈనేపథ్యంలో పీవీపీపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. కాగా ఇదే విషయంపై మరికాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు రానున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.

కాగా ఇటివలే విక్రమ్ కైలాస్ అనే వ్యక్తిపై పీవీపీ మనుషులు దాడి చేశారు. దీంతో విక్రమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పీవీపీపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంపై పోలీసులు పీవీపీకి నోటిసులు పంపించారు. నోటీసులు పంపించిన స్పందించకపోవడంతో ఈ రోజు ఆయన ఇంటికి వెళ్ళారు పోలీసులు. ఇదిలాఉండగా గతంలో నిర్మాత బండ్ల గణేశ్ తో కూడా పీవీపీ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే.