శాకుంతలం..మరింత ఆలస్యం!

71
- Advertisement -

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. సినిమా షూటింగ్ పూర్తయిన ఇంకా విడుదల తేదీ అనౌన్స్‌ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత, గుణశేఖర్ కూతురు నీలిమా గుణ అప్‌డేట్ ఇచ్చారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంచి అవుట్ పుట్ అందించేందుకు కష్టపడుతున్నాం.. గ్రాఫిక్స్ వర్క్స్‌ కోసం ఎక్కువ టైమ్ అవుతోంది…త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామని వెల్లడించారు.

దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు.

- Advertisement -