కొత్త రష్మికను చూస్తారు: దుల్కర్

83
- Advertisement -

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇవాళ హైదరాబాద్ సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగనుండగా తెలుగులో నేరుగా దుల్కర్ నటిస్తున్న తొలి చిత్రం ఇది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు దుల్కర్.

ఇది ఒక అందమైన ప్రేమకథ .. సహజత్వానికి దగ్గరగా నడిచే కథ. హను రాఘవపూడి ఈ కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని తెలిపారు. ఈ సినిమాకి సీత పాత్ర ప్రాణం… ఆ పాత్రకి మృణాల్ ప్రాణం పోసిందన్నారు. ఇక రష్మిక విషయానికి వస్తే తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని…తెరపై ఒక కొత్త రష్మికను చూస్తారని చెప్పారు.

- Advertisement -