Samantha:సమంత మాటలకు బాధలో ఫ్యాన్స్

45
- Advertisement -

గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో అల్లుఅర్జున్ కూతురు అర్హ ఇందులో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసింది సమంత. ‘అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుందని, తనకి ఇంగ్లీష్ రాదని చెప్పింది. ఈ జనరేషన్ పిల్లలకి తెలుగు చక్కగా నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అంటూ సమంత చెప్పుకొచ్చింది.

అలాగే, ‘శాకుంతలం’ సినిమా ప్రచారంలో భాగంగా సమంత ఓ ఇంటర్య్వూలో తన ఆరోగ్యంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మయోసైటిస్‌ వచ్చిన మొదట్లో బలహీనంగా అనిపించేది. యశోద మూవీ సమయంలో చాలా వీక్ గా ఉన్నా.. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదని, అతి కష్టంగానే ఒక ఇంటర్వ్యూ అయినా చేయాలనుకున్నా. ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తోంది అని సమంత చెప్పింది. సమంత ఇలా బాధ పడుతూ చెప్పడం ఆమె అభిమానులను బాధ పెడుతుంది.

సమంత శాకుంతలం సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ మూవీలో హీరోహిరోయిన్ల పాత్రల కోసం రూ.14 కోట్ల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వాడినట్లు వెల్లడించారు. దానవీరసూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే ఈ అభరణాలు తాను వినియోగించినట్లు సమంత చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -