ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

103
venkaiah
- Advertisement -

ఆజదీ కా అమృత్ మహాత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండుతుంది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడానికి ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -