శాకుంతలంలో బాలీవుడ్ నటుడు!

58
shakunthalam

టాలీవుడ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ రూపొందుతోంది. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. శకుంతల.. దుష్యంతులకు జన్మించినవాడే ‘భరతుడు’. ఆ భరతుడి పాత్రను అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ పోషిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా శాకుంతలంలో భాగం కానున్నారట. ఆయన ఈ పౌరాణిక డ్రామాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. నిర్మాత నీలిమ గుణ.. కబీర్ బేడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో పని చేయడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. దుర్వావ మహర్షి పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు.