నిరాడంబరంగా నిక్‌-ప్రియాంక‌ల నిశ్చితార్థం..

216
Priyanka Chopra
- Advertisement -

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కు వెళ్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు గత కొద్దికాలంగా హాలీవుడ్ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా బయట ఎంత కలిసి తిరిగినా తన ప్రియుడు నిక్ జొనాస్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని మీడియా ముందుకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు ప్రియాంక. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ ఎట్టకేలకు తన వివాహ ప్రయాణాన్ని మొదలుపెట్టేసింది. సాంప్రదాయక పంజాబీ పెళ్లిలో మొదటగా జరిపే రోకా వేడుకలో ఇద్దరు కలిసి ఉన్నఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Priyanka Chopra

గత కొంత కాలంగా షికార్లు చేస్తున్న పుకార్లకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ లు ముగింపు పలికారు. వారిద్దరి ఎంగేజ్‌మెంట్ ఈ రోజు ముంబైలోని ప్రియాంక నివాసంలో నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పసుపు రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోగా… కుర్తా పైజమా ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు నిక్. పూర్తిగా హిందూ సాంప్రదాయంలో ఈ నిశ్చితార్థం జరిగింది.

ప్రియాంక, నిక్ ల తల్లిదండ్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రియాంక కజిన్, సినీ నటి పరిణీతి చోప్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమె ఈ కార్యక్రమం కోసం ముంబైకు వచ్చింది. ఈ సాయంత్రం ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో వీరు ఎంగేజ్ మెంట్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీకి రణవీర్ సింగ్, కరణ్ జొహాలతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు.

- Advertisement -