కరోనా టీకా ధరను రూ. 250గా నిర్ణయించిన కేంద్రం..

253
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఆరోగ్య, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులు, భద్రతా బలగాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ చేపడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని, ఆ వ్యాక్సిన్ ఖర్చును తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే ప్రైవేట్‌ దవాఖానల్లో అందుబాటులో ఉండే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఒక్కో డోసు ఖరీదును గరిష్టంగా రూ 250గా ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యాక్సిన్‌ ధర రూ 150 కాగా సర్వీస్‌ ఛార్జ్‌ రూ 100గా నిర్ణయించి మొత్తం ధర రూ 250 మించరాదని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ‌ దవాఖానల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధర రూ 250కి మించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో దశ వ్యాక్సినేషన్స్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

- Advertisement -