విద్యార్థులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి..

22

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న 15-18 మధ్య వయసు కలిగిన యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ రోజు కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ స్థానిక హిందూ కళాశాల నందు మెడికల్ ,రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీని కళాశాల యాజమాన్యం పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ విద్యార్థిని విద్యార్థులు అందరితో కలిసి కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ గురించిన అపోహలు అన్నిటిని విడిచిపెట్టాలని, ఇప్పుడు విస్తరిస్తున్న కోవిడ్ వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరం వ్యాక్సిన్ వేయించుకోవడం వలన అతి తక్కువ మంది వైరస్ బారిన పడ్డామని, కనుక మీరు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు.

అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి భయాన్ని విడనాడాలని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్నారు.