ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రోత్సాహం- మంత్రి

145
Minister Koppula
- Advertisement -

ఎస్సి లలో ఉన్న తారతమ్యం పోయి వారు ఆర్థికంగా నిలదోక్కుకోవాలనే ఉద్దేశ్యంతో టెయిలరింగ్ శిక్షణను అందించి మహిళల అర్థిక అభ్యున్నతికి ప్రోత్సహం అందించడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమం సందర్బంగా ఎస్సి, ఎస్టి కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేతలతో కలిసి అంబారిపేట గ్రామంలోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ సామాజిక వర్గ జనాబా కలిగిన గ్రామాలను గుర్తించి వారిని ఆర్థిక పరమైన బరోసా కల్పించాలని, మాల, మాదిగ మరియు నేతకాని కులస్థుల ఎక్కువగా ఉన్న గ్రామాలై అంబరిపేట, కిషన్ రావు పేట మరియు కొత్తపేట గ్రామాలను మొదట గుర్తించడం జరిగిందని పేర్కోన్నారు. అంబారిపేట గ్రామంలో 40 మంది ఎస్సి మహిళను గుర్తించి, వారికి టెయిలరింగ్ పై శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. ఎస్సి, బిసి మరియు రెసిడెన్సి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సంబంధించిన యూనిఫామ్స్ కుట్టడానికి బయటివారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పూర్తయిన వెంటనే ఆ కాంట్రాక్టును మీకే అందించడం జరుగుతుందని మంత్రి హామిఇచ్చారు.

సాదారణంగా ఒకటి రెండు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణను ఇచ్చి అనంతరం సర్టిఫికెట్ తో పాటు కుట్టుమిషన్ను మహిళకు అందించడం జరిగేదని, మహిళను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో శిక్షణ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మొదటి రోజునే కుట్టు మిషన్ లను అందించి శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. మనం చేతులో ఉన్న వృతిని నమ్ముకోవడం వలన ఎక్కడికి వెళ్లిన బ్రతకగలమనే స్థైర్యాన్ని పొందగులుగుతారని అన్నారు. ఎంపిక చేసిన 40మంది శిక్షణను విజయంతం చేసి మరికొంత మందికి స్పూర్తిగా ఉండాలని అన్నారు. అంతే కాకుండా జూట్ బ్యాగుల, టెయిలరింగ్ మరికొన్ని శిక్షణలను ఇవ్వడం జరుగుతుందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టి కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, పిడి డిఆర్డిఓ లక్ష్మీనారాయణ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -