భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెలలో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో శీతాకాల విడిది చేయనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి సదరన్ జోన్‌కు రాలేకపోయారు. చివరిసారిగా 2019లో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేశారు. 2020, 2021లో రాష్ట్రపతి సదరన్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
రాష్ట్రపతి సదరన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఢిల్లీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎస్‌కు పంపించారు. ఇందులో డిసెంబర్ 28న ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 29న వివిధ రంగాల ప్రముఖులతో, అతిథులతో భేటీ కానున్నారు. తదుపరి డిసెంబర్ 30న సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేయనున్నారని ఢిల్లీ రాష్ట్రపతి కార్యాలయం పంపించిన టెంటేటివ్ షెడ్యూల్ లో పేర్కొన్నారు.
సీఎస్ సోమేశ్‌కుమార్ రాష్ట్రపతి నిలయం సిబ్బంది, జీఏడీ, పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులను కలిసి కో-ఆర్డినేషన్ మీటింగ్ జరపనున్నారు. తదనంతరం సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
ఇవి కూడా చదవండి….
జైల్లో పెడతారా..దేనికైనా సిద్ధం: కవిత
డిజిటల్ రూపాయి… ఎలా పనిచేస్తుంది?
తెలంగాణకే ఆదర్శంగా మునుగోడు..