సంక్రాంతి థియేటర్స్.. ప్రశ్నించిన బాలయ్య

134
- Advertisement -

వచ్చే సంక్రాంతికి బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు థియేటర్స్ లో వస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో విజయ్ వారసుడు డబ్బింగ్ సినిమాగా వస్తుంది. అయితే ఈ ఏడాది ఈ మూడు సినిమాలకు సంబంధించి థియేటర్స్ రచ్చ నడుస్తుంది.

దిల్ రాజు వారసుడు సినిమాకు నైజాం లో ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారనే ఆరోపణ ఉంది. అలాగే వైజాగ్ లో కూడా దిల్ రాజు వారసుడు కి బెస్ట్ థియేటర్స్ ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరు, బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ థియేటర్స్ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు చిరు, బాలయ్య.

తాజాగా బాలయ్య థియేటర్స్ గురించి అగ్ర నిర్మాత మరియు స్టార్ డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ ను బాలయ్య నేరుగా నాకు ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారు అంటూ అన్ స్టాపబుల్ టాక్ షో లో ప్రశ్నించాడు. తాజాగా ఈ షో ప్రోమో రిలీజయింది. ఈ ప్రోమో లో బాలయ్య క్వశ్చన్ వైరల్ అవుతుంది. షోలో థియేటర్స్ గురించి బాలయ్య వేసిన ఈ ప్రశ్నకి అల్లు అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యాడా? వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

ఇవి కూడా చదవండి…

నాకు హిట్3 కథ చెప్పలేదు -శేష్

నటి పూనమ్‌కు ఫిబ్రోమయాల్జియా…

వయసైపోతున్నా అందం తగ్గట్లేదు.. కారణమదే

- Advertisement -