యాదాద్రికి రాష్ట్రపతి..బ్రేక్ దర్శనాలు రద్దు

68
- Advertisement -

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా   బ్రేక్ దర్శనాలు, స్వామివారి ఆర్జిత సేవలను రద్దుచేశారు.

30న ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఈఎంఈ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు రాష్ట్రపతి. అక్కడి నుంచి ఐఏఎఫ్‌ ఎం17 హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట దేవస్థానం వద్ద హెలిప్యాడ్‌ స్థలానికి చేరుకుంటారు. 9.50 గంటలకు ప్రత్యేక వాహనంలో కొండపైకి బయల్దేరుతారు. 10 నుంచి 10.30 గంటల మధ్య స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక, ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలను కూడా క్యాన్సల్‌ చేస్తున్నామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -