నూతన సంవత్సరం..ట్రాఫిక్ ఆంక్షలు

154
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు 31న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు సైబరాబాద్‌ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్స్‌ను మూసివేయనున్నారు.

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఓఆర్‌ఆర్‌ను సైతం మూసివేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రం అనుమతిస్తామన్నారు. రోడ్లపై న్యూసెన్స్‌కు పాల్పడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించినా, ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

క్యాబ్‌, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలని సైబరాబాద్‌ పోలీసులు ఆదేశించారు. అంతేకాకుండా.. ప్రజలు వాహనాన్ని బుక్‌ చేసుకున్న తర్వాత రైడ్‌ను నిరాకరించినా..! అధిక చార్జీలు డిమాండ్‌ చేసినా.! చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే వెంటనే 9490617346 నంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.

మద్యం సేవించిన వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాన్ని నిర్వాహకులే కల్పించాలని ఆదేశించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, మొదటి సారి డీడీ కేసులో పట్టుబడితే రూ.10వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15వేల జరిమానా, రెండేండ్ల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇక డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -