జర్నలిస్ట్‌గా హీరో నిఖిల్..

189
Nikhil Siddartha

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోలందరూ విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలు చేయడానికే ఇష్టపడుతున్నారు. సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు ఈతరం యువ హీరోలు. అందులో హీరో నిఖిల్ కూడా ఒకరు. ‘కిర్రాక్‌ పార్టీ’ సినిమా తర్వాత ఆయన టీఎన్‌ సంతోష దర్శకత్వంలో విభిన్నమైన  సినిమా చేస్తున్నారు.

Nikhil Siddartha

ఇందులో నిఖిల్ సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీలుక్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ ప్రీలుక్‌లో నిఖిల్ జర్నలిస్టుగా కనిపించబోతున్నాడని స్పష్టమవుతోంది. విడుదల చేసిన ఈ ప్రీలుక్‌లో ‘కలం తుపాకీ కన్నా బలమైనది’ అంటూ..ఐడీ కార్డు, కెమెరాను చూపించారు.

ఇందులో ‘అర్జున్ సురవరం’ అనే క్యారెక్టర్‌లో నటించనున్నాడు నిఖిల్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జూన్ 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో వెన్నెల కిశోర్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిఖిల్ గతంలో ‘కిర్రాక్ పార్టీ’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.