ఫేవరెట్‌ హీరోయిన్‌ తన భార్యేనట

18
- Advertisement -

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మల్లారెడ్డి కాలేజ్‌ విద్యార్థులతో చిత్ర బృందం ముచ్చటించింది. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ సమాధానం ఇచ్చారు. ‘మీ ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు’ అని అడగ్గా, ‘నా ఫేవరెట్‌ హీరోయిన్‌నే నేను పెళ్లి చేసుకున్నా. మంచి కథలు దొరికితే లావణ్య, తాను కలిసి నటిస్తామని వరుణ్ తేజ్ వెల్లడించారు. లావణ్య తర్వాత తాను ఎక్కువగా అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

మరోవైపు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో గౌతమ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వం వహించిన ఓ థ్రిల్లర్ చిత్రంతో లావణ్య త్రిపాఠి ఈ ఏడాది సోలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. పాడైపోయిన పాఠశాలల్ని పునరుద్దరించే ప్రయత్నం చేసిన కలెక్టర్ గా లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మాటలు సాయి మాధవ్ బుర్రా సమకూరుస్తున్నారు. అన్నట్టు తనకు పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది అని, లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అని కొందరు వార్తలు రాస్తున్నారు.

ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఈ విషయంలో లావణ్య త్రిపాఠి పై పై అప్పుడే చాలా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. హీరోయిన్లు పిల్లల్ని కనకపోవచ్చనే ప్రచారం కూడా జరగడం బాధాకరమైన విషయం. ప్రస్తుతానికి అయితే, లావణ్య సినిమాల పై ఫోకస్ పెట్టింది.

Also Read:వీటితో..మీ ఆరోగ్యం పదిలం

- Advertisement -