సెట్స్‌పైకి నాగ్-ప్రవీణ్ మూవీ!

134
nagarjuna
- Advertisement -

వైల్డ్ డాగ్ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు కింగ్ నాగార్జున. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ “బంగార్రాజు”తో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో సినిమా చేస్తున్నారు. తాజాగా ప్రవీణ్ సత్తారు సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. మొదటి షెడ్యూల్ కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు గోవాలో పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ ఆగస్టు 4 నుండి హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది.

ఈ షెడ్యూల్‌లో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్ విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. నాగ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి.

- Advertisement -