‘వాలిమై’ ఫస్ట్ సింగిల్ రిలీజ్…!

133
naanga
- Advertisement -

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాలిమై. అజిత్ ఇండస్ట్రీలోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోగా తాజాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రారంభమైన దగ్గరి నుండి అప్‌డేట్ కోసం ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్‌ ట్రీట్ ఇచ్చారు.

తాజాగా ఫస్ట్ సంగిల్ రిలీజ్ చేయగా యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే 37 లక్షల వ్యూస్… 7 లక్షల 56 వేల లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది.

ఇండియా వైడ్ గా ‘వాలిమై’ ట్రెండ్ అవుతోండగా ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాదే వాలిమై చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

- Advertisement -